
- సెంట్రల్ మినిస్టర్ ఎస్ జై శంకర్
న్యూఢిల్లీ : గ్లోబల్‌గా ఇండియా ఇన్‌ఫ్లూయెన్స్ పెంచాలన్నా, ఆర్థికంగా చైనాతో పోటీ పడాలన్నా లోకల్‌గా తయారీ రంగం విస్తరించాలని, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో తయారీ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని, గత పదేళ్లలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ భారీగా పుంజుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తయారీ రంగాన్ని మరిచిపోయిందని
ఫలితంగా చాలా సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కు పెద్ద పీట వేస్తుండడంతోనే చైనాతో వ్యాపారం పెరుగుతోందని ఆయన వివరించారు. 2014 కు ముందు మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు ముఖ్యంగా స్మాల్
మీడియం కంపెనీలకు ప్రభుత్వం సరిపడినంత సపోర్ట్ ఇవ్వలేదని అన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ల వలన ఇండియా –మిడిల్ ఈస్ట్– యూరప్ కారిడార్ ఆలస్యం అయ్యిందని, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధిత దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.