వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్, కామెడీ కలయికతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ను సౌత్ కొరియాలో స్టార్ట్ చేశారు.
వారం రోజుల ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలతోపాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. వరుణ్ తేజ్‌తోపాటు హీరోయిన్ రితికా నాయక్, సత్య ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్‌తో మొత్తం షూటింగ్ పూర్తికానుంది. అనంతరం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి వెళ్ళనుంది.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.
