స్వదేశానికి  నైజీరియన్‌‌‌‌‌‌‌‌ డిపోర్ట్‌‌‌‌‌‌‌‌.. ఫేక్ పాస్‌‌‌‌‌‌‌‌ పోర్ట్తో ఇండియాలోకి ఎంట్రీ

స్వదేశానికి  నైజీరియన్‌‌‌‌‌‌‌‌ డిపోర్ట్‌‌‌‌‌‌‌‌.. ఫేక్ పాస్‌‌‌‌‌‌‌‌ పోర్ట్తో ఇండియాలోకి ఎంట్రీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నకిలీ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌, ఫేక్ వీసాతో ఎనిమిదేండ్లుగా ఇండియాలో అక్రమంగా నివసిస్తున్న ఓ నైజీరియన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు. ఢిల్లీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌తోపాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నివాసాలు మార్చుతూ తప్పించుకు తిరుగుతున్న అతన్ని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి, స్వదేశానికి డిపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈగల్ ఫోర్స్​అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాలోని డెల్టా రాష్ట్రంలో గల ఎవురు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌కు చెందిన విక్టరీ అపుమగన్ అలియాస్‌‌‌‌‌‌‌‌ కెన్నీ 2018 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3న యాకుబ్ అలీ పేరుతో ఘనాకు చెందిన నకిలీ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. అనంతరం నైజీరియా నుంచి ఘనాకు వెళ్లాడు. 2025 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు మకాం మార్చాడు. అప్పటి నుంచి కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఒక పీజీ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో సినిమా ఆఫర్లు రావడంతో 5 హిందీ, తెలుగు సినిమాల్లో నటించాడు. ఇలా 2018 నుంచి ఇండియాలోనే ఉంటూ.. వీసాను పొడిగించుకోలేదు. కెన్నీ గురించి సమాచారం అందడంతో ఇటీవల ఈగల్ ఫోర్స్ అధికారులు కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హాస్టల్‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వద్ద ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్న తర్వాత కెన్నీని శనివారం స్వదేశానికి డిపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.