2024–25 లో అదానీ క్యాపెక్స్‌‌‌‌ రూ. 80 వేల కోట్లు

2024–25 లో  అదానీ క్యాపెక్స్‌‌‌‌ రూ. 80 వేల కోట్లు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ప్రకటించింది. అదానీ న్యూ ఇండస్ట్రీస్‌‌‌‌ (ఏఎన్‌‌‌‌ఐఎల్‌‌‌‌), ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌లలో రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని కంపెనీ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్  సౌరభ్‌‌‌‌ షా ఎనలిస్టులు కాల్‌‌‌‌లో పేర్కొన్నారు. ఏఎన్‌‌‌‌ఐఎల్‌‌‌‌ సోలార్ మాడ్యూల్స్‌‌‌‌, గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌ను తయారు చేస్తోంది.  

మరో రూ.12 వేల కోట్లను రోడ్ బిజినెస్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తామని, గంగా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌హై కోసం ఎక్కువగా ఖర్చు చేస్తామని  సౌరభ్‌‌‌‌ పేర్కొన్నారు. పీవీసీ బిజినెస్‌‌‌‌ కూడా స్టార్ట్‌‌‌‌ చేశామని,  ఇందుకోసం రూ.10 వేల కోట్ల క్యాపెక్స్ అవసరమని తెలిపారు.  డేటా సెంటర్ బిజినెస్‌‌‌‌ కోసం రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామన్నారు.