
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాయిన్ అవ్వనున్న 12 వేల మంది ఫ్రెషర్లలో 85 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఇంజనీర్లను నియమించుకోవడంలో ఎటువంటి పక్షపాతం చూపడం లేదని చెప్పారు. ప్రొబీషనరీ ఆఫీసర్లు (పీఓ), అసోసియేట్లుగా 12 వేల మంది ఫ్రెషర్లను బ్యాంక్ నియమించుకుంటోంది.
3 వేల మంది పీఓలు, 8 వేల మందికి పైగా అసోసియేట్లకు ట్రెయినింగ్ ఇచ్చాక వివిధ బ్యాంకింగ్ రోల్స్‌లో వీరిని చేర్చుకుంటామని ఖారా పేర్కొన్నారు. వీరు బ్యాంకింగ్ సెక్టార్‌లోకి వచ్చాక ఐటీ, బిజినెస్‌లోని వివిధ రోల్స్‌లో జాయిన్ చేసుకుంటామన్నారు.
బ్యాంక్‌లో సరిపడినంత టెక్ మ్యాన్‌పవర్ ఉండేలా చూసుకుంటామని పేర్కొన్నారు. ఐటీ ఇండస్ట్రీలో అట్రిషన్ (రాజీనామాలు) ఎక్కువగా ఉన్న వేళ బ్యాంకింగ్ సెక్టార్‌లోకి ఇంజనీర్లు వస్తుండడం పెరుగుతోంది.