జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చిరవంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాద్యత అని చిరంజీవి అన్నారు. 

మరోవైపు  జూబ్లీహిల్స్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు ఓటు వేశారు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు ఎన్టీఆర్‌ . ఎన్టీఆర్‌తో పాటు వచ్చిన ఆయన సతీమణి లక్ష్మీప్రణతి, తల్లి షాలిని ఓటు వేశారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు అల్లు అర్జున్‌.