ప్లీజ్.. దయచేసి నన్ను అహంకారి అనొద్దు

ప్లీజ్.. దయచేసి నన్ను అహంకారి అనొద్దు

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్బంధన్ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఎన్డీయే గెలిచింది. ప్రస్తుత బిహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో నితీశ్ హవా తగ్గిందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. కూటమి విక్టరీకి మోడీ అట్రాక్షనే కారణమని తెలుస్తోంది. నితీశ్ పార్టీకి ఓట్లు తగ్గడానికి ఆయన అహంకారమే కారణమని కొందరు విమర్శిస్తున్నారు. ప్రజలతో నితీశ్ సరిగ్గా కమ్యూనికేట్ కాలేకపోయారని పొలిటికల్ ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ విమర్శలతోపాటు ఎలక్షన్ రిజల్ట్స్‌‌‌‌పై నితీశ్ కుమార్ స్పందించారు. తనను అహంకారి అని పిలవొద్దని కోరారు. సీఎంగా ఎవరు ఉండాలనేది ఎన్డీయే నిర్ణయిస్తుందన్నారు. తనకు ఎలాంటి అహంకారం లేదని, లాక్‌‌డౌన్ టైమ్‌లోనూ ప్రజలతో మయేకం అయ్యానని చెప్పారు. బిహార్ కోసం చాలా కష్టపడి పని చేశానని స్పష్టం చేశారు.