NEET పేపర్ లీకేజీ ఘోర పాపం.. నిందితులపై కఠిన చర్యలు: ప్రధాని మోదీ

NEET పేపర్ లీకేజీ ఘోర పాపం.. నిందితులపై కఠిన చర్యలు: ప్రధాని మోదీ

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. లీకేజీ ఘోర తప్పిదం అని చెప్పిన ప్రధాని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా మంగళవారం (జులై 21) NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. లీకేజీ వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లను శిక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  నీట్ లీకేజీ వ్యవహారంలో 13 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి లీకులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు నష్టం కలగకుండా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించినట్లు చెప్పారు. 

ALSO READ : మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. ఇప్పట్లో ఆగదా..

అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు.. పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రం అత్యంత వేగంగా స్పందించి.. కఠిన చర్యలకు పూనుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ డీక్లేర్ చేసినట్లు తెలిపారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని ప్రధాని చెప్పారని అన్నారు.