మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. ఇప్పట్లో ఆగదా.. మరి వెండి రేట్ల పరిస్థితి ఏంటి..?

మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. ఇప్పట్లో ఆగదా.. మరి వెండి రేట్ల పరిస్థితి ఏంటి..?

దాదాపు గడచిన 10 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వార్ తిరిగి స్టార్ట్ అయ్యింది. దీంతో బులియన్ మార్కెట్లు ప్రపంచ వ్యాప్తంగా స్తబ్ధతను చూస్తున్నాయి. కొద్ది రోజులు పెరుగుతూ మరికొన్ని రోజులు తగ్గుతూ దాదాపుగా రేట్లు అదే స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో రిటైల్ షాపింగ్ చేయాలని భావిస్తున్న తెలుగు ప్రజలు ముందుగా తమ దగ్గరలోని నగరాల్లో రేట్లు ఎలా మారాయో గమనించటం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పరిస్థితులు కుదుటపడితే గానీ గోల్డ్ అండ్ సిల్వర్ సామాన్యులకు అందుబాటు రేట్లలోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదని నిపుణులు అంటున్నారు. 

జూలై 21న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 20 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.76 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 422గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 220గా కొనసాగుతోంది. 

ALSO READ : ఎయిర్‌టెల్ 5G డేటా హాట్‌స్పాట్ షేరింగ్ నిలిపేసిందా..? 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 21, 2026న దేశవ్యాప్తంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 40వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.