ట్విట్టర్​లో 7 కోట్లు దాటిన మోడీ ఫాలోవర్లు

ట్విట్టర్​లో 7 కోట్లు దాటిన మోడీ ఫాలోవర్లు

న్యూఢిల్లీ: ట్విట్టర్​లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నోళ్ల సంఖ్య 7 కోట్లు దాటింది. ఇప్పుడు యాక్టివ్​గా ఉన్న పొలిటీషియన్లలో ఎక్కువమంది ఫాలో అవుతున్న నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోడీ తర్వాత పోప్ ​ఫ్రాన్సిస్​ను 5.3 కోట్ల మంది ఫాలో అవుతున్నరు. 2009లో గుజరాత్​ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ట్విట్టర్ వాడకాన్ని ప్రారంభించగా.. 2010లో లక్షమంది ఆయనను ఫాలో అయ్యారు. 2020  జులై నాటికి ఫాలోవర్ల సంఖ్య 6 కోట్లకు.. ఇప్పుడు 7 కోట్లకు చేరింది. అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​కు ట్విట్టర్​లో 3.9 కోట్ల ​​ఫాలోవర్లు ఉన్నారు. మాజీ  ప్రెసిడెంట్​ బరాక్​ ఒబామాకు 12.98 కోట్లు, ఫ్రాన్స్ ​ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​కు 71 లక్షల ​ఫాలోవర్లు​ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ​షా ట్విట్టర్​  ఖాతాను 2.63 కోట్ల మంది, కాంగ్రెస్​లీడర్ ​రాహుల్ ​గాంధీ ట్విట్టర్​ను 1.94 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. మొదట్లో 8.87 కోట్ల ఫాలోవర్ల​తో అమెరికా మాజీ  ప్రెసిడెంట్ డొనాల్డ్​ ​ట్రంప్ ​ట్విట్టర్​లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న యాక్టివ్ ​పొలిటీషియన్​గా రికార్డు సృష్టించారు. అయితే, ఆయన అకౌంట్​ను ట్విట్టర్ శాశ్వతంగా సస్పెండ్​చేసింది.