నగ్నత్వం తప్పయితే.. సాధువులందరినీ అరెస్ట్ చేయాలి

నగ్నత్వం తప్పయితే.. సాధువులందరినీ అరెస్ట్ చేయాలి

ముంబై: బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తుతున్న ఫొటోను పోస్ట్ చేయడం వివాదాస్పదవుతోంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మిలింద్ మీద సౌత్ గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటి పూజా బేడీ స్పందించింది. మిలింద్ సోమన్ న్యూడ్ రన్నింగ్ ఫొటోలో ఎలాంటి అశ్లీలత లేదని, అది అందంగా ఉందంటూ పూజా బేడీ కామెంట్ చేసింది.

‘అశ్లీలత అనేది వ్యూయర్స్ అతిగా ఊహించుకోవడంలో ఉంటుంది. మిలింద్ చేసిన తప్పు ఏంటంటే.. అతడు అందంగా ఉండటం, ఫేమస్ వ్యక్తి కావడం, బెంచ్ మార్క్‌‌ను సెట్ చేయడం! ఒకవేళ న్యూడిటీ క్రైమ్ అయితే నాగ సాధువులందరినీ అరెస్ట్ చేయాలి. బూడిదను పూసినంత మాత్రాన అలా ఉండటం ఆమోదయోగ్యం కాదు కదా!’ అని పూజా బేడీ ట్వీట్ చేసింది. గత వారం తన 55వ పుట్టిన రోజును పురస్కరించుకొని గోవా బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తుతూ దిగిన ఫొటోను మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.