పాప్ కార్న్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేసిన నాగార్జున

పాప్ కార్న్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేసిన నాగార్జున

సినీ నటుడు నాగార్జున పాప్ కార్న్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ గా సాయిరోనక్, అవికా గోర్ నటించారు. సినిమాట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అవికా గోర్ ఎమోషనల్ అయ్యింది. నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది. ‘నేను ముంబై నుంచి వచ్చా. నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్ గా తెలుగు అభిమానులు ఆదరించారు. సినీ ఇండస్ట్రీలో రాణించడం అంతా ఈజీ కాదు’ అంటూ అవికా గోర్ కామెంట్స్ చేశారు. 

పదేళ్ల క్రితం ఒక స్టూడియో చూడ్డానికి బ్రెజిల్ లోని రియోకి వెళ్లినట్లు నాగార్జున తెలిపారు. స్పానిష్ భాషలో ఉన్న ఒక బోర్డ్ చూశానని, అప్పుడే అవికా గోర్ ను చూసినట్లు చెప్పారు. చిన్నారి పెళ్లికూతురు సూపర్ డూపర్ సీరియల్ అని, 128 దేశాల్లో ఆ సీరియల్ రిలీజ్ అయిందన్నారు. అవికా గోర్ ఎప్పుడో పాన్ వరల్డ్ స్టార్ అని ప్రశంసించారు. కజకిస్థాన్ లో రెండు సినిమాల్లో ఆమె నటించిందన్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 10వ తేదీన సినిమా విడుదల చేస్తామని నిర్మాత భోగేంద్ర గుప్తా తెలిపారు.