ప్ర‌భాస్ సలార్ రిలీజ్ అప్డేట్ ఇదే..!

 ప్ర‌భాస్ సలార్ రిలీజ్ అప్డేట్ ఇదే..!

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా వస్తున్న మూవీ సలార్ (Salaar). ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాకు రాని హైప్ ఈ సినిమాకు వచ్చింది. నిజానికి బాహుబలి తరువాత ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా అంటే సలార్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

లేటెస్ట్గా సలార్ సినిమా పోస్ట్పోన్ అయినా విషయం తెలిసిందే. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయినప్పటికీ..మరో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ఆలోచిస్తున్నారు. సలార్ పోస్ట్పోన్ అయినా వెంటనే..బుక్మైషో కొత్త రిలీజ్ డేట్ను మార్చేసింది. ఈ మూవీ నవంబర్ 24న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సలార్ నవంబర్ 24న కనుక రిలీజ్ చేస్తే..27 వరకు లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో..ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.అలాగే మేకర్స్ మరిన్ని కొత్త డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 22,  అలాగే వచ్చే ఏడాది 2024 జనవరి 11 డేట్స్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సలార్ కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. 

https://in.bookmyshow.com/hyderabad/movies/salaar/ET00301886

సలార్ సినిమా రెండు పార్ట్స్ గా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనుంది. మొదటి పార్టీ కు సలార్: సీజ్ ఫైర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో పృద్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటిస్తున్నారు. కెజిఎఫ్ అదిరిపోయే మ్యూజిక్ ను అందించిన రవి బాసృర్ ఈ సినిమాకు కేసుల సంగీతం అందిస్తున్నాడు.