Salaar Movie: నేను ఖాన్సార్‌ భవిష్యత్తును నిర్ణయిస్తా..మీరు న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి: ప్రభాస్

Salaar Movie:  నేను ఖాన్సార్‌ భవిష్యత్తును నిర్ణయిస్తా..మీరు న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి:  ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ సలార్ (Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లో దూసుకెళ్తోంది. 2023 డిసెంబర్ 22న రిలీజైన మూవీ..ఇప్పటివరకు రూ.601 కోట్లుకు పైగా కలెక్ట్ చేసింది. నిన్న (డిసెంబర్ 31) ఒక్కరోజులోనే రూ.23కోట్లు కలేక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంచితే..హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. ఏదైనా తన సినిమా అప్డేట్ ఉంటే తప్ప..ఎలాంటి పోస్ట్ చేయడు . 

లేటెస్ట్గా ప్రభాస్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్కు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. తనదైన పోరాటాలతో సలార్ ఖాన్సర్ ప్రాంతాన్ని ఎరుపెక్కించిన ప్రభాస్..లేటెస్ట్ పోస్ట్తో ఫ్యాన్స్కు ఊపెక్కించారు. 'నేను ఖాన్సార్‌ భవిష్యత్తును నిర్ణయిస్తాను. మీరంతా న్యూ ఇయర్  సెలెబ్రేషన్స్ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సలార్‌ సినిమాని ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు..అంటూ సలార్ స్టైల్లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

 

అంతేకాకుండా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ప్రభాస్ మాట్లాడుతూ..‘సలార్‌ సినిమా సక్సెస్ మా టీమ్‌ అందరికీ మీరిచ్చిన గొప్ప గిఫ్ట్. ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ షూటింగ్ టైములో నిరంతరం చాలా శ్రమించారు. అందుకే ఇంత గొప్ప అవుట్‌పుట్‌ వచ్చింది. థియేటర్లో ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే..మా అందరికీ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు ప్రభాస్.