వరల్డ్ చాంప్‌‌‌‌‌‌‌‌ లిరెన్‌‌‌‌‌‌‌‌కు ప్రజ్ఞానంద్ చెక్

వరల్డ్ చాంప్‌‌‌‌‌‌‌‌ లిరెన్‌‌‌‌‌‌‌‌కు ప్రజ్ఞానంద్ చెక్

విక్‌‌‌‌‌‌‌‌ ఆన్ జి (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌) :  టీనేజ్ ఇండియన్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ ఆర్. ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ డింగ్ లిరెన్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఔరా అనిపించాడు.  టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌  టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌లో నల్ల పావులతో ఆడిన 18 ఏండ్ల ప్రజ్ఞా 62 ఎత్తుల్లో   చైనా స్టార్ లిరెన్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించాడు. 

దాంతో విశ్వనాథన్‌‌‌‌‌‌‌‌ ఆనంద్ తర్వాత  క్లాసికల్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌పై గెలిచిన రెండో ఇండియన్‌‌‌‌‌‌‌‌గా ప్రజ్ఞా నిలిచాడు. ఈ విజయంతో  ఇండియా టాప్ రేటెడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లెజెండ్ విశ్వనాథన్‌‌‌‌‌‌‌‌ ఆనంద్‌‌‌‌‌‌‌‌ను అధిగమించాడు. ప్రస్తుత ఫిడే లైవ్ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో ఉండగా.. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఆనంద్ 2748 పాయింట్లతో నిలిచాడు.