హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించి, విశ్వనగరం పేరు నిలపాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విస్తీర్ణంలో హైదరాబాద్ నగరం మూడోస్థానంలో ఉందన్నారు. నగరంలో జనాభా భారీగా పెరుగుతోందనీ, 2011లో 77 లక్షల మంది ఉంటే.. ప్రస్తుతం 1.13 కోట్లకు పెరిగిందని చెప్పారు. వారందరికీ విద్యా, ఉపాధి, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. నగరంలో ట్రాఫిక్, వరద నీరు, పొల్యుషన్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
