- హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ప్రముఖులు
హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము అతిథులను పేరుపేరునా పలకరించారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కాగా, రాష్ట్రపతి ముర్ము సోమవారం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము అతిథులను పేరుపేరునా పలకరించారు.
ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కాగా, రాష్ట్రపతి ముర్ము సోమవారం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
