దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ ఈద్-ముబారక్

దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ ఈద్-ముబారక్

దేశవ్యాప్తంగా బక్రీద్ ను జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఢిల్లీలోని ప్రఖ్యాత జామ మసీదులో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కరోనా గైడ్ లైన్స్ పాటించాలన్నారు జామ మసీదు ఇమామ్. పరిమిత సంఖ్యలోనే మసీదులోకి అనుమతిస్తున్నామన్నారు. ఒక్కసారి 15 నుంచి 20 మంది మాత్రమే ప్రార్థనలు చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నామన్నారు. 

బక్రీద్ సందర్భంగా జామ మసీదు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీ జస్మిత్ సింగ్. సోషల్ డిస్టెన్స్, మాస్కులు పెట్టుకుంటున్నారని చెప్పారు. లేకపోతే ఇక్కడ చాలా రద్దీగా ఉండేదని, ఇమామ్ కూడా కరోనా నిబంధనలు పాటించేలా ప్రజలకు విజ్ఞప్తి చేశాడని తెలిపారు. దేశ ప్రజలకు ఈద్-ముబారక్ చెప్పారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈద్ ప్రేమ, త్యాగానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, సోదర భావం పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కరోనా గైడ్ లైన్స్ పాటించాలని కోరారు రాష్ట్రపతి.