కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  శంకరపట్నం మండలం తాడికల్ లో డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది.తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఆరుగురుని ట్యాంకర్ అదుపు తప్పి ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై ట్యాంకర్ బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  టాంకర్ డ్రైవర్ క్లీనర్ లను స్థానికులు గ్రామపంచాయితీలో బంధించారు. ఆస్సత్రికి తీసుకెళ్లిన వారి మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.