మన వ్యాక్సిన్లు కోట్ల ప్రాణాలను కాపాడినయ్

మన వ్యాక్సిన్లు కోట్ల ప్రాణాలను కాపాడినయ్
  • పార్లమెంటునుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ స్పీచ్ 
  • దేశ పునాదుల్ని మరింత పటిష్టం చేసేలా కేంద్రం కృషి  
  • ఏ వ్యక్తీ ఆకలితో అలమటించొద్దన్నదే లక్ష్యం
  • రామప్ప, ధోలవీరకు యునెస్కో గుర్తింపు గర్వకారణమని కామెంట్స్


న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ఏ ఒక్క వ్యక్తీ ఆకలితో అలమటించకూడదన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని 
రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అన్నారు. కరోనా విపత్తు సమయంలో ఎన్నో దేశాల్లో పేదలు ఆకలితో అలమటించారని, కానీ తమ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీంను తెచ్చి పేదలను ఆదుకుందన్నారు. 

సోమవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. అన్ని వర్గాలు కలిసికట్టుగా శ్రమించి కరోనాపై పోరాటంలో విజయం సాధించామని, మన దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయన్నారు. వచ్చే 25 ఏండ్లు దేశ పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్కీంలు, ప్రోగ్రాంలు, అమృత్ మహోత్సవ్, అభివృద్ధి వంటి అనేక అంశాలపై 53 నిమిషాల స్పీచ్ లో ఆయన వివరించారు.    

రాష్ట్రపతి ఇంకా ఏమన్నారంటే..  
కరోనా మహమ్మారిపై దేశం స్ఫూర్తిదాయకమైన పోరాటం చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, సైంటిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, ప్రజలంతా ఒక టీం స్పిరిట్ తో పని చేశారు. ప్రభుత్వం, ప్రజల మధ్య ఉన్న ఈ పరస్పర నమ్మకం బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం.  దేశంలో ఏడాది కంటే తక్కువ టైంలోనే 150 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయగలిగాం. దేశంలో తయారైన టీకాలు కోట్లాది మంది ప్రాణాలను కాపాడినయి. అర్హులైన ప్రజల్లో ఇప్పటికే 90 శాతం పైగా మందికి ఫస్ట్ డోస్ టీకాలు పూర్తయ్యాయి. అలాగే పేదలకు మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రవేశపెట్టింది. కోట్లాది మంది ప్రజలకు ఈ కార్డులు ఎంతో ఉపయోగపడ్డాయి. 

 సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కా సాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కా వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూల సూత్రంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాకు యూపీఐ ఒక సక్సెస్ ఫుల్ ఎగ్జాంపుల్. యూపీఐ వల్ల దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు ఊపందుకున్నాయి. అంబేద్కర్ అడుగుజాడల్లోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ పాలసీల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇటీవల పద్మ అవార్డుల ప్రకటనలోనూ ఇదే విషయం స్పష్టంగా ప్రతిబింబించింది. 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) స్కీం కింద 11 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు కేంద్రం లబ్ధి చేకూర్చింది. ఇప్పటివరకు మొత్తం రూ. 1.80 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతం కావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే విమెన్ ఎంపవర్ మెంట్ కు ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోంది. ఇందులో భాగంగా 2021–-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించింది. ఇది 2014-–15 కంటే 4 రెట్లు ఎక్కువ.  బేటీ బచావో బేటీ పఢావో స్కీం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. బడుల్లో బాలికల అడ్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల శాతం గణనీయంగా పెరిగింది.  పీఎం స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటివరకు 28 లక్షల మంది వీధి వ్యాపారులు ఈ స్కీం కింద ఆర్థిక సాయం పొందారు. 

కేంద్ర ప్రభుత్వ కృషితో యోగా, ఆయుర్వేదం, ట్రెడిషనల్ మెడిసిన్ కు ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జనఔషధి కేంద్రాల ఏర్పాటు ద్వారా తక్కువ ధరకే మందులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వం అనేక వ్యాధులకు చికిత్సల ఖర్చును కూడా గణనీయంగా తగ్గించగలిగింది. దేశవ్యాప్తంగా 2014లో 90 వేల కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేలు ఉంటే, ప్రస్తుతం 1.40 లక్షల కిలోమీటర్లకు పెరిగాయి. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాల ప్రాజెక్టు కింద రూ.6 లక్షల కోట్లతో 20 వేల కి.మీ. మేర ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేల నిర్మాణం పూర్తయింది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన ద్వారా రోజుకు100 కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. గతేడాది కాలంలో 24 వేల కి.మీ. మేర రైల్వే లైన్లు నిర్మించాం. దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో దేశంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. 

టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశ యువత తమ సత్తా చాటింది. మన క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో ఒలింపిక్స్ లో 7 మెడల్స్,  టోక్యో పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 19 మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు.  దేశంలో నక్సల్స్ 126 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండగా, గత కొన్నేండ్లలో వాటి సంఖ్య70 జిల్లాలకు తగ్గింది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందం కుదరడంతో దశాబ్దాల పాటు సాగిన హింసకు ప్రభుత్వం ముగింపు పలికింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో గోల్డెన్ చాప్టర్ గా నిలుస్తాయి. ఈశాన్యంలో కనెక్టివిటీ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.  క్లైమేట్ చేంజ్ సమస్యపై ఇండియా ప్రపంచానికే గొంతుకగా అవతరించింది. వాతావరణ మార్పు సమస్య మొత్తం ప్రపంచానికే సవాలుగా మారుతున్న సమయంలో దానిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల టార్గెట్లతో ముందుకు వెళ్తోంది. 

రామప్పకు యునెస్కో గుర్తింపు గర్వకారణం 
దేశంలోని ప్రాచీన వారసత్వ కట్టడాల పరిరక్షణ, గుర్తింపు కోసం కృషి చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు. తెలంగాణలోని13వ శతాబ్దానికి చెందిన రామప్ప దేవాలయం, గుజరాత్ లోని హరప్పా కాలం నాటి ధోలవీర సిటీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో చోటు దక్కడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్ కుంభమేళా, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఐకానిక్ దుర్గా పూజ సైతం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులోకి చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ ఎంపీల గైర్హాజరు 
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి స్పీచ్​కు గైర్హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో మాత్రం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.