న్యాయం ఖరీదైపోయింది: రామ్‌‌నాథ్ కోవింద్

న్యాయం ఖరీదైపోయింది: రామ్‌‌నాథ్ కోవింద్

జోధ్​పూర్: దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందనంత దూరంలో ఉందని ప్రెసిడెంట్ రామ్‌‌నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘న్యాయ ప్రక్రియ ఎక్స్​పెన్సివ్​గా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించడం సామాన్యులకు అసాధ్యంగా మారింది” అని ఆయన అన్నారు. రాజస్థాన్ హైకోర్టు కొత్త భవనాన్ని శనివారం ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘ఇవ్వాళ ఎవరైనా పేద లేదా అన్నీ కోల్పోయిన వ్యక్తి తన ఫిర్యాదుతో ఇక్కడికి రాగలుగుతున్నాడా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందరికీ న్యాయం అందజేసే బాధ్యతను మనం స్వీకరిస్తూ రాజ్యాంగ ప్రియాంబుల్ లో పొందుపరిచాం” అని వివరించారు. న్యాయ ప్రక్రియ ఖర్చుల గురించి గతంలో మహాత్మా గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ గుర్తు చేశారు. 9 రీజినల్ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు.