అమెరికాలో ఉన్న భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వైట్‌హౌస్ జరిగిన వేడుకల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ ప్రవాస భారతీయులు, శ్వేతసౌధం సిబ్బంది పండుగ వేడుకల్లో పాల్గొనడంతో సందడి ఏర్పడింది. పండుగ జరుపుకొంటున్న అందరికీ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికా దేశ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటైన మతస్వేచ్ఛకు దీపావళి వేడుకలు నిదర్శనమన్నారు ట్రంప్. దేశంలోని అన్నిమతాల ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా పండుగు జరుపుకొనే స్వేచ్ఛ అమెరికా కల్పిస్తోందని.. వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో 2009 నుంచి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

