అతన్ని దూరం పెడుతుందని గొంతుకోసి చంపాడు

అతన్ని దూరం పెడుతుందని గొంతుకోసి చంపాడు

సిద్దిపేట జిల్లా: గజ్వేల్‌లో ఈ నెల 18న బ్యాంకు ఉద్యోగి దివ్య హత్యోదంతంపై  ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిద్దిపేట ఇంచార్జ్ కమిషనర్ శ్వేత. దివ్య ను హత్య చేసిన నిందితుడు వెంకటేష్ ను అరెస్ట్ చేశామని, దివ్య ను తానే హత్య చేసినట్లు వెంకటేష్ ఒప్పుకున్నాడని ఆమె తెలిపారు.

“దివ్య, వెంకటేష్  లు వేములవాడ లో 9,10 వ తరగతులు కలిసి చదువుకున్నారు. పై చదువులు చదువుకునే సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దివ్య బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని వెంకటేష్ వెంటపడే వాడు. గజ్వేల్‌లో ఉద్యోగం చేస్తునప్పటి నుండి  దివ్య… వెంకటేష్ ను దూరం పెట్టింది. దీనితో దివ్య పై వెంకటేష్ కక్ష పెంచుకున్నాడు. మరో వైపు  దివ్య కు పెళ్లి నిశ్చయం కావడం తో ఎలాగైనా దివ్యను హతామార్చాలని నిర్ణయించుకున్నాడు. రెండు మూడు సార్లు దివ్య ఉంటున్న ఇంటికి, బ్యాంక్ కి వచ్చి వెళ్ళాడు.

ఈ నెల 18వ తేదీ రాత్రి దివ్య  బ్యాంక్ నుండి ఒంటరిగా వెళుతుండటం గమనించిన వెంకటేష్ ఆమెను వెంబడించాడు. ఇంటికొచ్చిన దివ్య డాబా పై నుండి ఆరేసిన బట్టలు తీసుకు వస్తుండగా కత్తితో ఆమె గొంతుపై, ఇతర భాగాలపై పొడిచి చంపాడు. హత్య చేసి నేరుగా సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుండి రైల్ లో విజయవాడ, అక్కడి నుండి వరంగల్ మీదుగా వేములవాడ కు చేరుకున్నాడు. వేములవాడలో నిందితుణ్ణి అరెస్ట్ చేశామని, నిందితునికి కఠిన శిక్ష పడటం కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని” కమిషనర్ శ్వేత తెలిపారు. ప్రస్తుతం నిందితుణ్ని రిమాండ్ కు తరలించినట్టు ఆమె చెప్పారు.