హైదరాబాద్ US కాన్సులేట్ Good News : యూస్ స్టూడెంట్స్ వీసా స్లాట్స్ బుకింగ్స్ ఓపెన్

హైదరాబాద్ US కాన్సులేట్ Good News : యూస్ స్టూడెంట్స్ వీసా స్లాట్స్ బుకింగ్స్ ఓపెన్

యూస్‍లో హైయర్ స్టడీస్ చేయాలనుకునే వారికి హైదరాబాద్ US కాన్సులేట్ గుడ్ న్యూస్ చెప్పింది. మే నెలాఖరులో జరిగే ఇంటర్వ్యూల కోసం స్టూడెంట్ వీసా ఫస్ట్ ఫేజ్ స్లాట్ బుకింగ్ రిలీజ్ చేసింది. అలాగే కొన్ని వారాల్లో జూన్, జూలై, ఆగస్ట్ బ్యాచ్ లకు అడిషినల్ స్లాట్లు విడుదల చేయనున్నట్లు హైదరాబాద్ US కాన్సులేట్ ప్రకటించింది. ఇండియాలో 2023 ఫైనాన్షియల్ ఈయర్ లో అమెరికాకు 1లక్షా 40వేల వీసాలు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 

ఫారన్ కంట్రీస్ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు సంవత్సరానికి 38 బిలియన్ల యూస్ డాలర్లు ఇండియా ఆర్థిక వ్యవస్థకు యాడ్ చేస్తున్నారు. అత్యధికంగా  2017 ఆర్థిక సంవత్సరంలో  6 లక్షల వీసాలు ఇచ్చారని డిపార్ట్ మెంట్ తెలిపింది. వీసా స్లాట్ బుకింగ్ కోసం హైదరాబాద్ లోని నానక్ రామ్ గుడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లోని ఆఫీస్ ను సంప్రదించాలని హైదరాబాద్ యూస్ కాన్సులేట్ పేర్కొంది.