నేరేళ్ల బాధితులకు చెక్కులు..రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం

నేరేళ్ల బాధితులకు చెక్కులు..రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • 2017లో ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
  • దళితుల అరెస్టు.. పోలీసుల థర్డ్ డిగ్రీ
  • అప్పట్లో మీరా కుమార్​తో కలిసి పరామర్శించిన రేవంత్ రెడ్డి
  • ఆ ఫ్యామిలీలకు చెక్కులిచ్చిన సీఎం 

2017 జులై 2న నేరెళ్లకు చెందిన ఒక వ్యక్తి ఇసుక లారీ ఢీకొని మరణించడంతో గ్రామస్తులు ఆగ్రహించి, అక్రమ ఇసుక రవాణాను వ్యతిరేకిస్తూ లారీలకు నిప్పు పెట్టారు. లారీలను తగులబెట్టారనే ఆరోపణతో పోలీసులు ఆ గ్రామానికి చెందిన దళిత, బీసీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో వారిని తీవ్రంగా కొట్టి, కరెంట్ షాక్‌‌‌‌లు ఇచ్చారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నేరెళ్ల బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు  సభ అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ చేశారు.