హైదరాబాద్ లో పెట్రోల్ ధర ఆల్ టైమ్ రికార్డ్

హైదరాబాద్ లో  పెట్రోల్ ధర ఆల్ టైమ్ రికార్డ్

మరోసారి పెట్రో  ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 26 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు.  ఈ వీక్ లో గురువారం వరకు ధరలు పెరిగాయి. నిన్న ఒక్క రోజు బ్రేక్  ఇచ్చిన కంపెనీలు ఇవాళ పెంచాయి. తాజా ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 93 రూపాయల 94 పైసలు, లీటర్ డీజిల్ 84 రూపాయల 89 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ వంద రూపాయలు దాటింది. లీటర్ పెట్రోల్ 100 రూపాయల 19 పైసలకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 97 రూపాయల 63 పైసలు, లీటర్ డీజిల్ 92 రూపాయల 54 పైసలుగా ఉంది. 

నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడం మొదలు పెట్టాయి.  లీటర్ పెట్రోల్ పై 3 రూపాయల 61 పైసలు, డీజిల్ పై 4 రూపాయల 11 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఒపెక్ దేశాల మంత్రుల సమావేశం జూన్ 1న జరగనుంది. జూలైలో ముడి చమురు ఉత్పత్తి పెంచుతారనే వార్తలు వస్తున్నాయి.  ఉత్పత్తి పెంచితే, ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్.