యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తున్న వెబ్‌‌‌‌సైట్లు, యాప్‌‌లు

యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తున్న వెబ్‌‌‌‌సైట్లు, యాప్‌‌లు

న్యూఢిల్లీ: స్మార్ట్‌‌‌‌‌‌ఫోన్లు వాడుతున్న వారికి ప్రైవసీ పెద్ద సమస్యగా మారింది. మొబైల్‌‌‌‌లో ఉన్న ప్రతీ యాప్‌‌‌‌ కెమెరా, కాంటాక్ట్స్‌‌‌‌, లొకేషన్ అంటూ వివిధ పర్మిషన్లను యూజర్ల నుంచి తీసుకుంటున్నాయి. గత ఐదేళ్లలో కెమెరా పర్మిషన్‌‌‌‌ అడుగుతున్న యాప్‌‌‌‌లు 45 శాతం నుంచి 68 శాతానికి పెరిగాయి. అదే మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతున్న యాప్‌‌‌‌లు 28 శాతం నుంచి 54 శాతానికి పెరిగాయని డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కంపెనీ ఆర్కా పేర్కొంది. 25 ఇండస్ట్రీలకు చెందిన 201 మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లను, వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లను పరిశీలించి ఈ డేటాను ఆర్కా విడుదల చేసింది. 

గూగుల్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లతో డేటా పంచుకుంటున్నాయ్‌‌‌‌..

ఈ స్టడీ ప్రకారం, మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లు, వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు యూజర్ల డేటాను ఎక్కువగా గూగుల్‌‌‌‌తో షేరు చేసుకుంటున్నాయి. తర్వాత ప్లేస్‌‌‌‌లో ఫేస్‌‌‌‌బుక్ ఉంది. 97 శాతం వెబ్‌‌‌‌సైట్లలో గూగుల్‌‌‌‌ ట్రాకర్లు ఉన్నాయని, 55 శాతం వెబ్‌‌‌‌సైట్లలో ఫేస్‌‌‌‌బుక్ ట్రాకర్లు ఉన్నాయని ఈ స్టడీ వెల్లడించింది.  అంతేకాకుండా 42 శాతం ఆండ్రాయిడ్ యాప్‌‌‌‌లు యూజర్ల డేటాను గూగుల్‌‌‌‌తో షేర్ చేసుకుంటున్నాయని, 25 శాతం యాప్‌‌‌‌లు ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌తో యూజర్ల డేటాను షేరు చేసుకుంటున్నాయని వివరించింది. ‘స్టేట్ ఆఫ్ డేటా ప్రైవసీ ఆఫ్ ఇండియన్ మొబైల్‌‌‌‌ యాప్స్‌‌‌‌ అండ్ వెబ్‌‌‌‌సైట్స్‌‌‌‌’ పేరుతో ఈ స్టడీని ఆర్కా విడుదల చేసింది. గత ఐదేళ్ల నుంచి వివిధ ఇండస్ట్రీలకు చెందిన యాప్‌‌‌‌లను, వెబ్‌‌‌‌సైట్లను ఈ సంస్థ పరిశీలిస్తోంది. 

మొబైల్‌‌‌‌ యాప్స్‌‌‌‌ వీటినే ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నాయి..
ఆండ్రాయిడ్‌‌‌‌ యాప్‌‌‌‌లు

1)    యూజర్ల లొకేషన్‌‌‌‌ను 75 %  యాప్‌‌‌‌లు యాక్సెస్ చేస్తున్నాయి.
2)    కెమెరాను 68 %  యాప్‌‌‌‌లు, మైక్రోఫోన్‌‌‌‌ను 54% యాప్‌‌‌‌లు యాక్సెస్ చేస్తున్నాయి. 
ఐఓఎస్ యాప్‌‌‌‌లు.
1) 56 %  యాప్‌‌‌‌లు యూజర్ల లొకేషన్‌‌‌‌ను, 
69 % యాప్‌‌‌‌లు కెమెరాను, 41% యాప్‌‌‌‌లు 
కాంటాక్ట్స్‌‌‌‌ను యాక్సెస్ చేస్తున్నాయి. 
వెబ్‌‌‌‌సైట్లు..
1)    96 %  వెబ్‌‌‌‌సైట్లలలో కనీసం ఒక ట్రాకర్ అయిన ఉంటోంది.
2)    ఒక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సగటున 21 థర్డ్‌‌‌‌ పార్టీ ట్రాకర్లు ఉంటున్నాయి. ఇందులో 8 ట్రాకర్లు థర్డ్‌‌‌‌ పార్టీ కుకీల రూపంలో ఉంటున్నాయి.
3)    వెబ్‌‌‌‌సైట్లలో థర్డ్‌‌‌‌పార్టీలు అమర్చిన ట్రాకర్లలో 98 శాతం అడ్వర్టయిజింగ్‌‌‌‌, ట్రాకింగ్ కోసమే పనిచేస్తున్నాయి.  
డేటాను సేకరించేందుకు యూజర్ల పర్మిషన్ తీసుకొని..యాప్‌‌‌‌‌‌లు, వెబ్‌‌‌‌సైట్లు  కొత్త ఫీచర్లను, సర్వీస్‌‌‌‌లను తీసుకొస్తున్నాయని ఆర్కా అభిప్రాయపడింది. ‘ఇండియన్  కంపెనీలు డేటా ప్రైవసీకి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయనే విషయం ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. చాలా అంశాల్లో ప్రైవసీ అధ్వాన్నంగా మారడాన్ని గమనించొచ్చు’ అని సంస్థ సీఈఓ శివంగి నడ్కార్ని అన్నారు.