EMIలపై ప్రైవేట్ బ్యాంకుల క్లారిటి..

EMIలపై ప్రైవేట్ బ్యాంకుల క్లారిటి..

కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పటికే ప్రజల, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. అయితే ప్రజలు బ్యాంకులకు కట్టాల్సిన ఈఎమ్ఐ మూడునెలలకు వాయిదా వేస్తున్నట్లు (మారటోరియం సదుపాయం కల్పిస్తున్నట్లు) గతవారం ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఈఎమ్ఐను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈఎమ్ఐ ను వాయిదా వేసుకునే వెసులుబాటును కల్పించాయి. అయితే మారటోరియం వద్దనుకునే వారు, కావాలనుకునే వారు బ్యాంకులను సంప్రదించాలని సూచించాయి. ఇప్పటికే ఎస్ఎమ్ఎస్‌లను ఖాతాదారులకు పంపుతున్నాయి ప్రైవేట్ బ్యాంకులు.

మారటోరియం అవసరం లేని వాళ్లు తమను సంప్రదించాల్సిన అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. మారటోరియం కావాలనుకునే వాళ్లు మాత్రం తమకు ఈమెయిల్ చేయాలంటూ తెలపింది కోటక్ మహేంద్రా బ్యాంకు. అయితే మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని తెలిపాయి.  ఐసీఐసీఐ బ్యాంకు రెండు ఆఫ్షన్స్‌ను ఖాతాదారులకు ఇచ్చింది. ఈఎమ్ఐ కట్టేవాళ్లు కట్టవచ్చని లేనివాళ్లు కట్టకున్నా పర్లేదని చెప్పింది. అయితే కట్టేవాళ్లు ముందుగా బ్యాంకుకు తెలియచేయాలని చెప్పింది.