నల్గొండలో విషాదం: పిల్లలు పుట్టడం లేదని స్కూల్లోనే ప్రాణం తీసుకున్న టీచర్ ..

నల్గొండలో విషాదం: పిల్లలు పుట్టడం లేదని స్కూల్లోనే ప్రాణం తీసుకున్న టీచర్ ..

నల్గొండ, వెలుగు : సంతానం కలగడం లేదనే మనస్తాపంతో ఓ ప్రైవేట్​ టీచర్​ స్కూల్​లోనే సూసైడ్​ చేసుకున్న ఘటన నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది. టూటౌన్​ సీఐ రాఘవరావు, స్థానికులు  తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ కు చెందిన మండల్ నందిత(36)  నల్గొండ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. 

ఆమెకు వివాహమై 14 ఏండ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. ఈ విషయమై ఆమె కొంతకాలంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. ఈ క్రమంలోనే సోమవారం స్కూల్ ముగిసిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమె అదే స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త  మండల్ ప్రొలాయి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు