హైదరాబాద్, వెలుగు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఈ చాంపియన్స్.. టీజీ 20 లీగ్‌లో బోణీ చేసింది. బ్యాటింగ్‌లో అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గడుగు గణేష్ (50 నాటౌట్)కు తోడు బౌలింగ్‌లో అజయ్ దేవ్ గౌడ్ (4/21) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రయికర్స్‌పై గెలిచింది.
టాస్ ఓడిన పాలమూరు 19.4 ఓవర్లలో 141 రన్స్‌కు ఆలౌటైంది. రోహిత్ రాయుడు (35), ప్రతీక్ పవార్ (30), విఘ్నేశ్ రెడ్డి (30) మెరుగ్గా ఆడారు. తర్వాత హైదరాబాద్ 15.4 ఓవర్లలో 147/3 స్కోరు చేసి నెగ్గింది.
అభిరత్ రెడ్డి (35) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌పై గెలిచింది. ముందుగా మెదక్ 164/8 స్కోరు చేయగా, రంగారెడ్డి 167/5 స్కోరు చేసి నెగ్గింది.
