జవాన్ సినిమాలో హీరో విజయ్ అని చెప్పి.. అట్లీ నన్ను చీట్ చేశాడు

జవాన్ సినిమాలో హీరో విజయ్ అని చెప్పి.. అట్లీ నన్ను చీట్ చేశాడు

వెయ్యి అబద్ధాలాడైన ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. అయితే జవాన్(Jawan) సినిమా కోసం అట్లీ(Atlee) ఒక అబద్దమాడాడట. ఈ విషయంలో దర్శకుడు అట్లీ నన్ను మోసం చేశాడని చెప్పుకొచ్చారు నటి ప్రియమణి(Priyamani). తాజాగా ఆమె కీ రోల్ లో కనిపించిన బ్లాక్ బస్టర్ మూవీ జవాన్. షారుఖ్(Shahkukh) అండ్ అట్లీ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. 

ఇదిలా ఉండే తాజాగా జవాన్ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు నటి ప్రియమణి. జవాన్ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ముందు జవాన్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఏదో చిన్న క్యామియో రోల్ ఉంటుందని అనుకున్నాను కానీ.. షారుఖ్ టీమ్ లో కీ రోల్ అని తెలిసి చాలా ఆనందించాను. డైరెక్టర్ అట్లీ అని తెలిసి ఓకే చెప్పేశాను. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. జవాన్ సినిమా విషయంలో అట్లీ నన్ను చీట్ చేశాడు. 

ఎలా అంటే.. ఈ సినిమాలో తమిల్ లో దళపతి విజయ్.. తెలుగులో ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారని టాక్ వినిపించింది. దీంతో నేను అట్లీ దగ్గరికి వెళ్లి.. విజయ్ తో ఒక్క సీన్ ఉండేలా చూడమని చెప్పాను. దానికి అట్లీ కూడా ఓకే అన్నారు. అలా సినిమా చివరి వరకు చెప్తూనే వచ్చాడు అట్లీ. చివరికి ఆ ఇద్దరు జవాన్ లో నటించలేదు. ఇలా అబద్దం చెప్పి అట్లీ నన్ను చీట్చేశాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది ప్రియమణి. ప్రస్తుతం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.