బిగ్‍బాస్-7లో ఫస్ట్ కంటెస్టెంట్.. పొట్టి పిల్ల సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్

బిగ్‍బాస్-7లో ఫస్ట్ కంటెస్టెంట్.. పొట్టి పిల్ల సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) సందడి షురూ అయింది. ఈ సీజన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు షో స్టార్ట్ అవ్వడంతో కేరింతలు వేస్తున్నారు. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జునే(King Nagarjuna) హోస్ట్ చేస్తుండగా ఫ్యాన్స్ కు మరోసారి కిక్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ తో కింగ్ ఈ సీజన్‌ను ప్రారంభించారు. 

లేటెస్ట్ స్టార్ట్ అయినా బిగ్ బాస్ హౌస్ లోకి జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్(Priyanka Jain)..బిగ్ బాస్ హౌస్ కి  ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ఎంతో ఫేమస్ అయినా ప్రియాంకా..బిగ్ బాస్ కి 'పొట్టి పిల్ల పొట్టి పిల్ల' సాంగ్ తో ఎంట్రీ అవ్వడంతో షోలో హుషారు మొదలైంది. తన స్మార్ట్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఫిదా చేసిన ప్రియాంక..బిగ్ బాస్ తో ఎంత మంది హృదయాలను కొల్లగొడుతుందో చూడాలి.

ఇక రీసెంట్ గా జానకి కలగనలేదు ఎపిసోడ్ ఎండ్ అవ్వడంతో..హార్ట్ అయినా ఫ్యాన్స్ కు..మరోసారి కనిపించడానికి రెడీ అవ్వడంతో..ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే జానకి కలగనలేదు కు ముందు మౌన రాగం వంటి సీరియల్ తో అమ్ములు గా ఆకట్టుకుంది. ప్రసెంట్ ప్రియాంక నెవర్ ఎండింగ్ టేల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తుంది. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న ఈ బ్యూటీకి కేవలం ఇన్ స్టా లోనే 4 లక్షల 38 వేల మంది ఫాలో అవుతున్నారు.