
హాలీవుడ్లో సంచలన విజయం సాధించిన యానిమేటెడ్ చిత్రాల్లో ‘ఫ్రోజెన్’ ఒకటి. రెండు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డుల్ని సైతం అందుకున్న ఈ మూవీ సీక్వెల్ ‘ఫ్రోజెన్ 2’.. ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నవంబర్ 22న రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్‌కి ప్రియాంక, పరిణీతి వాయిస్ ఇస్తున్నారు. ఎల్సా అనే క్యారెక్టర్‌కి ప్రియాంక, ఆనా పాత్రకి పరిణీతి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయం గురించి ప్రియాంక మాట్లాడుతూ ‘ఎల్సా అనేది చాలా స్ట్రాంగ్ రోల్. అందుకే వాయిస్ ఇవ్వడానికి వెంటనే ఒప్పుకున్నాను. ఆనా పాత్రకి పరిణీతి వాయిస్ ఇస్తుందని తెలియగానే చాలా సంతోషమేసింది. ఇంతవరకూ మేమిద్దరం కలిసి పని చేయలేదు. ఆ చాన్స్ ఇలా వచ్చినందుకు హ్యాపీగా ఉంది’ అంది. ‘ఫ్రోజెన్ నా ఫేవరేట్ సినిమా. దీనికి నేను పని చేస్తానని ఎప్పుడూ అనుకో లేదు. నా రియల్ లైఫ్ సిస్టర్‌తో కలిసి డబ్బింగ్ చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే అక్క, నేను వ్యక్తిత్వపరంగా ఎల్సా, ఆనాల్లాగే ఉంటాం. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్’ అంటోంది పరిణీతి. మొత్తానికి అక్కాచెల్లెళ్లిద్దరూ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో పాలు పంచుకున్నారు. మరి ఈ పాత్రలకు తెలుగులో ఏ హీరోయిన్లు గొంతు అరువిస్తారో!