PEDDI: ‘పెద్ది’ ఎలా ఉంటుందో చెప్పేసిన నిర్మాత .. భారీ అంచనాలు పెంచేశాడు భయ్యా

PEDDI: ‘పెద్ది’ ఎలా ఉంటుందో చెప్పేసిన నిర్మాత .. భారీ అంచనాలు పెంచేశాడు భయ్యా

నిర్మాతగా తొలి సినిమా రామ్ చరణ్‌‌‌‌తో చేయడం తన అదృష్టం అని నిర్మాత వెంకట సతీష్ కిలారు అన్నారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్​ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ చెప్పిన విశేషాలు. 

‘‘ఈ చిత్రం ఒక  పూర్తి స్థాయి రూరల్ యాక్షన్ డ్రామా. టైటిల్ కార్డ్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ అన్నింటినీ పర్ఫెక్ట్‌‌‌‌గా మిక్స్ చేశారు.  రామ్ చరణ్ ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు తీవ్రంగా శ్రమించారు.  గాయాలున్నా షూటింగ్‌‌‌‌కు హాజరయ్యేవారు. ఆయన డెడికేషన్‌‌‌‌కు హ్యాట్సాఫ్.

శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి నటుల పాత్రలు కథలో బలమైన ఇంపాక్ట్ కలిగిస్తాయి.  సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఏ.ఆర్. రెహమాన్ కథ విన్న వెంటనే ఎంతో ఎక్సయిట్ అయ్యారు. ఆయన అందించిన మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు ఇంకా పెరుగుతాయి.  అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా పవర్‌‌‌‌‌‌‌‌ప్యాక్డ్‌‌‌‌గా సినిమా ఉంటుంది. బిజినెస్ ఇప్పటికే పూర్తయింది.  కంటెంట్‌‌‌‌పై టీమ్‌‌‌‌కు పూర్తి నమ్మకం ఉంది. ఇక  నా తదుపరి చిత్రం నందమూరి బాలకృష్ణ- గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందుతోంది’’అని సతీష్ వెల్లడించారు