ఢిల్లీలో వర్షం.. ఆందోళన చేస్తున్న రైతులకు ఇబ్బందులు

ఢిల్లీలో వర్షం.. ఆందోళన చేస్తున్న రైతులకు ఇబ్బందులు
ఢిల్లీలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన రేవారీ, కోసాలీ, మహేంద్రగఢ్, ఛర్కిదాద్రీ, ఫరూఖ్ నగర్, జజ్జర్, రోహ్ తక్, సోనీపట్, పానిపట్ లలో ఉదయం నుంచి చిన్నపాట వాన కురిసింది. అలాగే ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ, బాగ్ పట్, గజియాబాద్, మీరట్, హపుర్, గౌతమ్ బుద్ధనగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఢిల్లీలో కురిసిన వర్షానికి సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న రైతులు ఇబ్బంది పడ్డారు. వారి టెంట్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. మరోవైపు రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఢిల్లీ, నోయిడాల్లో కాలుష్యం కాస్త తగ్గి… గాలి నాణ్యత మెరుగుపడింది. కరోనా విజృంభణ.. యూకేలో మళ్లీ లాక్ డౌన్   Protesters at Singhu border (Delhi- Haryana) affected due to continuous rainfall#FarmLaws pic.twitter.com/lufaPTNNui — ANI (@ANI) January 5, 2021