EHS హెల్త్ కార్డుల కోసం ఫ్యామిలీ డేటా సేకరించాలని ఆదేశాలు

EHS హెల్త్ కార్డుల కోసం ఫ్యామిలీ డేటా సేకరించాలని ఆదేశాలు
  • ఈనెల 31లోపు వివరాలు అప్‌‌‌‌లోడ్ చేయాలని డెడ్ లైన్
  • ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ మెంబర్స్ వివరాల సేకరణ

 హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) అమలు కోసం ప్రత్యేకంగా ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని, అందుకోసం ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

1972 నాటి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ సెక్షన్ 7 ప్రకారం అర్హులైన వారి డేటాను సేకరించాలని డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాకుండా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించాలన్నారు. 

ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌‌‌‌‌‌‌‌ లో నమోదు.. 

సేకరించిన డేటాను నిర్ణీత ప్రోఫార్మాలో (ఐఎఫ్ఎంఎస్ హెచ్ఆర్)​ మాడ్యూల్ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా విభాగాల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తమ లాగిన్ల ద్వారా ఈ వివరాలను మే 31లోపు తప్పనిసరి పూర్తిచేయాలని ఆదేశించారు. తక్కువ సమయం ఉన్నందున యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ డేటా సేకరణ అంశాన్ని టాప్ ప్రయారిటీగా పరిగణించాలని అధికారులకు డైరెక్టర్ స్పష్టం చేశారు.