హైదరాబాద్ సిటీలో పెట్రోల్ పరేషాన్ : బంకుల దగ్గర ఆగమాగం : కొరత లేకపోతే నో స్టాక్ బోర్డులు ఎందుకు పెడుతున్నారు..?

హైదరాబాద్ సిటీలో పెట్రోల్ పరేషాన్ : బంకుల దగ్గర ఆగమాగం : కొరత లేకపోతే నో స్టాక్ బోర్డులు ఎందుకు పెడుతున్నారు..?

హైదరాబాద్ సిటీ అంతా పెట్రోల్ పరేషాన్ నడుస్తోంది. ఎవరి నోట విన్నా పెట్రోల్, డీజిల్ మాటలే.. రోడ్డెక్కిన తర్వాత ఏ బంకు దగ్గర చూసినా క్యూలు. వందల సంఖ్యలో కార్లు, బైక్స్ పెట్రోల్, డీజిల్ కోసం క్యూలు. హైదరాబాద్ సిటీ పెట్రోల్ పరేషాన్ నడుస్తుంది. 

పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందంట.. రెండు రోజులుపోతే అస్సలు దొరకదంట.. బంకులు మూసేస్తారంట అనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఇదే సమయంలో రెండు, మూడు రోజులుగా వరసగా మూతబడుతున్న పెట్రోల్ బంకులతోపాటు.. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. 

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. కొన్ని బంకులు మూసేసి ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు తీస్తున్నారు.

రెగ్యులర్ గా 100, 200 రూపాయలు కొట్టించుకునే వాళ్లు సైతం.. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారు. ధర ఎంత పెరిగినా 100 రూపాయలు కొట్టించుకునే బ్యాచ్ సైతం.. ఇప్పుడు 500 రూపాయలు కొట్టిస్తున్నారు. ఇదే సమయంలో కార్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలు సైతం ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారు. కొంత మంది అప్పులు చేసి మరీ పెద్ద వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీలో రోజువారీ పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక్కసారి మూడింతలు పెరిగింది. దీంతో బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇది కూడా వాహనదారులను పరేషాన్ కు గురి చేస్తుంది. ఓ వైపు ప్రభుత్వం ఇంధన కొరత లేదు అని చెబుతున్నా.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు పెడుతున్నారు.. బంకులు ఎందుకు మూసేస్తున్నారనే ప్రశ్నలు.. వాహనదారుల్లో మరింత గందరగోళానికి.. అనుమానాలకు తావిస్తోంది.