ఆధ్యాత్మికం : ఏ భోగాన్ని అనుభవించినా దాని విలువను ఏదో ఒక రూపంలో తిరిగి చెల్లించాల్సిందేనా..!

ఆధ్యాత్మికం : ఏ భోగాన్ని అనుభవించినా దాని విలువను ఏదో ఒక రూపంలో తిరిగి చెల్లించాల్సిందేనా..!

భక్త కబీర్​ ఒక రోజు రామ భజనలు పాడుకుంటూ, భుజాన జోలె కట్టుకొని వీధుల్లో నడుచుకుంటూ సాగిపోతున్నాడు. ఇల్లిల్లూ తిరుగుతూ ఓ పెద్ద భవనం ముందు నిలబడ్డాడు. అది అందమైన ఓ దేవదాస్ ఇల్లు.   కబీర్​  'భిక్షాందేహీ' అనగానే, కాలిమువ్వల సవ్వడితో, కాటుక దిద్దిన కలువ రేకుల్లాంటి కన్నులతో ఆ దేవదాసి ఇంటి బయటకు వచ్చింది. అందానికి అర్ధం చెప్తున్నట్టుగా ఉందామె. గిన్నెలోని భిక్షను ఆయన జోలెలో వేసింది. కబీర్ ఆమె కళ్లను అలా ఒక్కసారి చూసి, ఓ పసిపిల్లాడిలా చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ ముందుకు సాగిపోయాడు.

 కొన్ని నెలల తర్వాత కబీర్​ దాస్​ మళ్లీ అదే వీధికి బిక్షాటనకు వచ్చి, దేవదాసి ఇంటి ముందు ఆగాడు . 
ఒకప్పుడు రాజభోగాలతో రాజిల్లిన ఆ భవనం ఈ రోజు బూజుపట్టి బోసిపోయి కనిపించింది. ఎంత పిలిచినా ఎవ్వరూ  బయటకు రాలేదు. అలా మందుకు వెళ్తూ, ఆయని శ్మశానం ముందు నిలబడి, దూరంగా కట్టెలపై నగం కాలిపడి ఉన్న ఓ శవాన్ని చూశాడు. అంతకు ముందే ఏదో పెద్ద వ్యాధితో కన్నుమూసిన దేవదాని శరీరమని ఎవరో చెప్పారు.

 క్షణాల్లో ఒక కాకి వచ్చి ఆవాసి పుర్రెపై వాలింది. అప్పుడు కబీరుకు తను గతంలో చూపిన ఆమె కళ్లు గుర్తుకొచ్చాయి. 'అయ్యో! నాడు కాటుకతో కళకళలాడి, హోయలు కురిపించిన కళ్లు ఏమయ్యాయి? పుర్రెలో గుంటలుగా చూడాయి. ఆ కనుబొమ్మలపై కాకులు వాలి కావ్​కావ్​ మంటున్నాయి. భోగాలేని శాశ్వతం కావు కావు' అని హెచ్చరిస్తున్నాయి. అనుకుంటూ ఇంకో ఊరికి పయనమయ్యాడు..


ఈలోకంలో ఏభోగాన్ని అనుభవించినా దాని విలువను ఏదో ఒక రూపంలో చెల్లించాల్సిందే! ఇంద్రియాలను ఇష్టారాజ్యంగా సంతృప్తిపరుచుకుంటూ పోతే దాని ఫలితాలు భరించాల్సింది అగ్నికి అజ్యం పోసి ఆర్పాలనుకోవడం ఎంత అవివేకమో, కోరిందల్లా ఇచ్చి మనసును సంతృప్తి పరచాలనుకోవడం కూడా అంతే అవివేకం కళ్ల నుంచి నాలుక వరకు ఏ ఇంద్రియాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితికి వచ్చేశాం. అందుకే. అవసరం లేకపోయినా కంటికి కావాలని అనిపించించ తెచ్చి, ఇంట్లో పడేస్తున్నాం. తిని అరిగించుకునే శక్తి లేకపోయినా జిహ్వచాపల్యంతో పనికిరాని తిండిని కడుపులోకి తోసేస్తున్నాం. చివరకు అప్పుల పాలే కాకుండా.. ఆస్పత్రుల పాలవుతున్నాం. అనారోగ్యం వచ్చే వరకూ శరీరాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఎన్ని
అవస్థలు పడాల్సి వస్తుందో అర్థంకావడం లేదు.

శరీరమే సాధనం

ఈ ప్రపంచంలో మనం ఏం సాధించడానికైనా ఆరోగ్యకరమైన శరీరమే అన్నింటికంటే ముఖ్యమైన సాధనం. అందుకే 'శరీరమాద్యంఖలు ధర్మసావనం' అంటారు. అలాంటి దేహాన్ని భోగాలకే పరిమితం చేసి, పాపాలపుట్టగా మార్చేస్తే అదే మన అభివృద్ధికి అడ్డుపడుతుంది. భౌతికమైన కోరికలను మనం ఎంత తగ్గించుకుంటే, బుద్దికి అంత శక్తి సంకల్పం పెరుగుతాయి.

 కేవలం శరీరం తాలుకు కోరికలకే మనసును పరిమితం చేస్తూ పోతే, ఉన్నతమైన విషయాల వైపు దృష్టిమళ్లదు. ఈ కాలంలో మనిషి శరీరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.. అలా అంటే దాన్ని కట్టేయమని కాదు. దానికి ఎంత అవసరమో అంత సంతృప్తిపరిస్తే చాలు అని గురువులు చెప్పేమాట. అందుకే పూర్తి వైరాగ్యమూ వద్దు, పూర్తి లోలత్వమూ వద్దు.

 ఇంద్రియాలు చెప్పిందంతా వినకండి. అలాగని అడిగినదేదీ ఇవ్వకుండా వాటిని ఆకలితో మాడ్చకండి. మీ స్నేహితులుగా, సహచరులుగా మెలిగేలా వాటికి శిక్షణ ఇవ్వండి ఇదే మధ్య మార్గం' అని చెప్తాడు గౌతమ బుద్ధుడు. ఇంద్రియసుఖాలను ఎంత పెంచుకుంటే ఈ ప్రపంచానికి అంత దాస్యం చేయాల్సి ఉంటుంది.బానిసనగా అష్టైశ్వర్యాలు అనుభవించే కన్నా.. స్వతంత్రంగా మొత్తుకొని బతికినా చాలు!