టేకు చెట్టుపై కోతిని చూసిన చిరుత పులి.. తప్పించుకుంటూ కోతి.. వేటాడుతూ చిరుత.. రెండూ సచ్చిపోయినయ్ !

టేకు చెట్టుపై కోతిని చూసిన చిరుత పులి.. తప్పించుకుంటూ కోతి.. వేటాడుతూ చిరుత.. రెండూ సచ్చిపోయినయ్ !

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలుకాలో విషాద ఘటన జరిగింది. హై టెన్షన్ వైర్లు ఎక్కడం వల్ల రెండు మూగ జీవాలు ‌చనిపోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పింపల్ గావ్ ఖాన్ ప్రాంతంలో మోహన్ ధరానె అనే రైతు పొలంలో ఒక టేకు చెట్టుపై కోతి కూర్చుని ఉంది. 

అటవీ ప్రాంతం కావడంతో అటుగా వచ్చిన చిరుతపులి టేకు చెట్టు మీద కూర్చుని ఉన్న కోతిని చూసింది. చెట్లు కూడా ఎక్కే స్వభావం ఉన్న చిరుత పులి కోతిని వేటాడేందుకు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. అడవిలో చిరుత పులిని, పులిని రాకను గమనించి ఇతర వన్య ప్రాణులను అలర్ట్ చేసేదే కోతి.

అలాంటి కోతి చిరుతకు చిక్కుతుందా.. చిరుత పులి నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడానికి టేకు చెట్టు పై నుంచి పక్కకు దూకింది. అయితే.. ఈ క్రమంలోనే దురదృష్టం కోతిని వెంటాడింది. టేకు చెట్టుకు పది అడుగుల దూరంలోనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ హై టెన్షన్ తీగల మీదకు కోతి దూకింది.

కోతిని తరుముతూ చిరుత పులి కూడా దూకింది. హై టెన్షన్ వైర్లు కావడంతో కరెంట్ షాక్తో రెండూ స్పాట్లోనే చనిపోయాయి. కోతి కాలిపోయి బూడిదై కిందపడిపోగా, చిరుత పులి హై టెన్షన్ వైర్లపై విగత జీవిగా కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.