ఆధ్యాత్మికం : మరణాన్ని మననం చేసుకుంటూ ఉంటే అహంకారం పుట్టదు.. నడక తడబడదు.

ఆధ్యాత్మికం : మరణాన్ని మననం చేసుకుంటూ ఉంటే అహంకారం పుట్టదు.. నడక తడబడదు.

నీళ్లలోన మీను నెలమాంస మాశించి 
గాలముందు చిక్కు కరణీ భువిని
ఆశ  తగిలి నరుడు నాలాగు చెడిపోవు
విశ్వదాభిరామ వినుక మేము! 

భావం :  నీటిలోని చేప ఎర్రగా వేసిన మాంసపు ముక్కకోసం ఆశతో గాలంలో చిక్కుకుంటుంది. అదే విధంగా భోగాలను ఆశించిన మనిషి ఆశల గాలానికి చిక్కుకొని దానిలోనే జీవితాన్ని వెళ్లబుచ్చుతూ కష్టాల పాలవుతాడు.

సింపుల్ లైఫ్ స్టయిల్

మనకు ఎన్ని భోగవస్తువులు ఉంటే అంత ఆధునికులం. నాగరికులమనుకునే భ్రమల్లో ఉన్నది. అందుకే మనం వాడే వస్తువుల రోజురోజుకీ పెరిగిపోతోంది. కొన్ని వస్తువులు లేకుంటే మన ప్రాణాలే పోతాయేమో అనిపించేంతగా మనం వాటికి అలవాటు పడిపోయాం చుట్టూ భోగవస్తువుల మధ్య జీవించినప్పుడు వాటిని అనుభవించడానికి అనువైన దారులే కనపడతాయి అంటారు. శ్రీ శారదామాత. ఇందుకే ఆమె మనం ఊహించనైనా.. ఊహించలేనన్ని అతి తక్కువ అవసరాలతో భౌతిక జీవనాన్ని గడిపారు.

 బట్టల నుంచి విహారాల వరకు వీలైనంత నిరాడంబరతకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు అవసరాల పేరుతో అతిగా సంపాదించాల్సిన ఆవసరం లేదు. అడ్డదారులు తొక్కాల్సిన
అవసరం అంతకున్నాలేదు.

మరణమే శరణం

మనకు నిరంతరం ఆ సర్వేశ్వరుడి రూపంతో. పాటు శ్మశానం కూడా మనసులో మెదులుతూ ఉండాలి. క్షణం తీరిక లేకుండా తిరుగుతూ .... ఎన్ని దారుల్లో ఎన్ని సంపాదించినా కీర్తిప్రతిష్ఠల గర్వంతో ఎగిరినా చివరికి అందరూ చేరుకునేది. ఆ మరుభూమికే! 

గుర్రం జాషువా 'శ్మశానవాటిక' కవితాఖండికను  గుర్తు చేసుకోవాలి. అదేంటో తెలియదు కానీ, మనమంతా చావు అంటే మనకు సంబంధం లేని విషయంగా ప్రవర్తిస్తుంటాం. పక్కింట్లో దొంగలు పడితే, మన ఇంట్లో కూడా పడతాదేమోనని ముందు జాగ్రత్తగా తుప్పు పట్టిన తాళాలను బాగు చేసుకుంటాం. కానీ, పక్క ఇంట్లో ప్రాణాలు పోతే, మనవి కూడా ఏదో ఒకనాడు పోతాయని, పాపపు పనులు మానుకొని, తప్పులు సరిదిద్దుకొని, మంచి పనులు చేయాలన్న ప్రయత్నమే చేయం .  చావు గురించి ఆలోచిస్తే అది పెద్ద అపచారం అన్నట్లుగా.. దాన్ని దాచేస్తుంటాం. కానీ, మరణాన్ని మననం చేసుకుంటూ ఉంటే మన నడక తడబడదు. అహంకారం పుట్టదు!