సిద్దూకు మద్దతుగా పంజాబ్ మంత్రి రాజీనామా

సిద్దూకు మద్దతుగా పంజాబ్ మంత్రి రాజీనామా

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ రాజీనామా చేసి షాక్ ఇచ్చిన కొద్దిసేపటికే క్యాబినెట్ మంత్రి రజియా సుల్తానా సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి పంజాబ్ రాష్ట్రంలో  సిద్ధూ పనిచేస్తున్నారని.. ఆమె స్పష్టం చేశారు. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు తాను మద్దతుగా నిలవనున్నట్లు తెలిపారు. మంత్రి రజియా సుల్తానా భర్త ముస్తఫా నవజ్యోత్ సింగ్ సిద్దూ వద్ద సలహాదారుగా పనిచేస్తున్నందున సిద్ధూ అనుమతితోనే ఆమె రాజీనామా చేసినట్లు స్పష్టం అవుతోంది. 
సిద్దూ రాజీనామా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీని ఉలికిపాటుకు గురిచేయగా..  సిద్దూకు మద్దతుగా మంత్రి.. పార్టీ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి గుల్జర్ ఇందర్ కూడా సిద్ధూకు మద్దతుగా రాజీనామా ప్రకటన చేయడం పంజాబ్ కాంగ్రెస్ లో కలకలం రేపింది. రాజీనామా చేస్తానని ట్రెజరర్ గుల్జర్ ఇందర్ చెప్పడమే కాదు రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపి తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. అధ్యక్ష పదవి వదులుకుంటున్నట్లు ప్రకటించిన సిద్ధూ పార్టీ కోసం పని చేస్తానని రాజీనామా లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు మద్దతుగా కేబినెట్‌ మంత్రి రజియా సుల్తానా, ట్రెజరర్  రాజీనామా ప్రకటనలతరవాత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ ఛని వెంటనే కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నష్ట నివారణ చర్యల కోసం మంత్రివర్గ సహచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.