పంజాబ్ ఎన్నికల్లో ‘ఆప్’ రికార్డులే...నాలుగేండ్ల పాలనలో ప్రజల మన్ననలు పొందాం..!

పంజాబ్ ఎన్నికల్లో ‘ఆప్’ రికార్డులే...నాలుగేండ్ల పాలనలో ప్రజల మన్ననలు పొందాం..!
  • పార్టీ చీఫ్ ​కన్వీనర్ కేజ్రీవాల్

చండీగఢ్: నాలుగేండ్ల పాలనలో పంజాబ్ ప్రజల మన్ననలు పొందామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్​ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ సర్కారుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వానికి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబీలు మరోమారు ఆప్ కే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2027 ఎన్నికల్లో ఆప్ గత రికార్డును బద్దలు కొడుతుందని చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం కేజ్రీవాల్ బుధవారం లుధియానా చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేకపోవడంతో ప్రతిపక్షాలు సీఎం మాన్‌‌‌‌‌‌‌‌ను దూషిస్తున్నాయని ఫైర్​అయ్యారు.