కొరియా ఓపెన్‌ నుండి సింధు ఓటమి

కొరియా ఓపెన్‌ నుండి సింధు ఓటమి

భారత స్టార్ బాడ్మింటన్ పీవీ సింధుకు కొరియన్ ఓపెన్‌ ఆరంభంలోనే నిరాశ ఎదురైంది.ఇవాళ అమెరికాకు చెందిన జంగ్ బీవెన్ తో జరిగిన మ్యాచ్ లో సింధు ఓటమిపాలైంది. దీంతో తొలి రౌండ్‌లోనే ఈ టోర్నమెంటు నుంచి ఔట్ అయ్యింది. బీవెన్‌తో 21-7, 22-24, 15-21 తేడాతో సింధూ ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో పీవీ సింధు ధాటిగా ఆడి పై చేయి సాధించినప్పటికీ… రెండో రౌండ్‌లో బీవెన్  విజృంభించడంతో వెనక్కితగ్గింది. మూడో రౌండ్‌లోనూ బీవెన్ ధాటిగా ఆడటంతో.. చివరి రెండు రౌండ్లలో సింధుకి ఓటమి తప్పలేదు.