- ఆర్ కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గంజి ప్రసాద్ అధ్యక్షతన సోమవారం నిరుద్యోగ జేఏసీ సదస్సు జరిగింది.
ముఖ్య అతిథిగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఓటమి పాలైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ను గెలిపించారని, కానీ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
