రాష్ట్రంలో గిరిజనుల బతుకులు ఆగం : రవీంద్ర నాయక్

రాష్ట్రంలో గిరిజనుల బతుకులు ఆగం :  రవీంద్ర నాయక్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్  పాలనలో గిరిజన బతుకులు దుర్భరంగా మారాయని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్ర నాయక్  అన్నారు. గిరిజన బంధు ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. తొమ్మిదేండ్లలో ఎంత మంది గిరిజనులను అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. 

శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గిరిజన తండాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేక అనేక మంది గిరిజనులు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. పోడు భూముల పట్టాలు అర్హులైన వారికి అందడం లేదన్నారు. 

ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా అన్యాయం: విఠల్

జర్నలిస్టుల హౌసింగ్  సొసైటీకి చెందిన 70 ఎకరాల భూమిని వారికి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే దక్కించుకోవాలని చూస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్  అన్నారు. జర్నలిస్టులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. వారికి కేటాయించిన  భూములను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.