తీన్మార్కు పోవాలి అనుకుంటుండె: రాధ

తీన్మార్కు పోవాలి అనుకుంటుండె: రాధ

‘వీ6’ చానల్ల తీన్మార్ వస్తున్నదంటే టీవీకి అతుక్కపోయేదాన్ని. యూట్యూబ్ల రిపీట్స్లో చూస్తుండె. ‘అరె, ఎంత మంచిగుంటది ఈ ప్రోగ్రామ్. మనం మాట్లాడుకున్నట్టే న్యూస్ చెప్తరు. అచ్చమైన జనం భాష. నేను కూడా ఆ ప్లేస్ల ఉంటే మస్త్ ఉంటుండె కదా అనుకునేదాన్ని. ఎప్పటికన్న వీ6ల తీన్మార్ వార్తలు చదవాలె’ అని గట్టిగ ఫిక్స్ అయిన. చదువు అవ్వంగనే టీవీ చానల్ల యాంకరింగ్ చేసిన. ఆ తర్వాత ఇట్ల అనుకోకుండా తీన్మార్ అవకాశం వచ్చింది. ఇది నా డ్రీమ్, ఎగిరి గంతేసిన. రాధ క్యారెక్టర్ మొన్ననేగా ఎంట్రీ ఇచ్చింది, ఇప్పుడిప్పుడే మెల్లగా జనాల్లోకి పోతున్నది. తీన్మార్కి వచ్చినంక ఏ క్యారెక్టర్ అయినా ఫేమస్ అయ్యేదే కదా!
– రాధ