పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో 14వ టైటిల్ నెగ్గి తన గ్రాండ్‌స్లామ్స్ సంఖ్యను 22కు పెంచుకున్న రఫెల్ నడాల్ తన ఆటతో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. 36 ఏండ్ల వయసులోనూ అద్భుత పెర్ఫామెన్స్ చేసిన నడాల్ గాయంతోనే ఈ టోర్నీలో ఆడాడు. నొప్పి తట్టుకునేందుకు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని నడాల్ స్వయంగా వెల్లడించాడు. ‘పక్కటెముకల్లో నొప్పి కారణంగా నెలన్నర పాటు ప్రాక్టీస్‌కు దూరమయ్యా. అదే టైమ్‌లో పాదం గాయం వల్ల ఈ టోర్నీలో ప్రతీరోజు ఇబ్బంది పడ్డా. డాక్టర్ నా వెంటే ఉన్నాడు. నరానికి పెయిన్ కిల్లర్ ఇచ్చేవాడు. అప్పుడు నా పాదంలో ఎలాంటి ఫీలింగ్ ఉండేది కాదు. ఒక రకంగా అది మొద్దుబారేది కాబట్టే నేను మ్యాచ్‌లు ఆడగలిగాను’ అని నడాల్ చెప్పాడు. ఈ గాయంతో ఫ్రెంచ్ ఓపెన్ తప్పితే మరో టోర్నీలో తాను పాల్గొనేవాడిని కాదని వెల్లడించాడు.

