రఫెల్‌ గేమ్‌ ఛేంజర్‌‌.. చైనా జే 20 దగ్గరకు కూడా రాలేదు: ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌

రఫెల్‌ గేమ్‌ ఛేంజర్‌‌.. చైనా జే 20 దగ్గరకు కూడా రాలేదు: ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌లో రఫెల్‌ యుద్ధ విమానాలు గేమ్‌ ఛేంజర్స్ అని ఇండియన్‌ ఎయిర్‌‌ ఫోర్స్‌ మాజీ చీఫ్‌ బీజేంద్ర సింగ్‌ ధనావో అన్నారు. 2019లో పాకిస్తాన్‌పై జరిపిన ఎయిర్‌‌స్ట్రైక్స్‌ రూపకర్త ఈయనే. ఫ్రాన్స్‌ నుంచి రఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం అంబాలాకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు. రఫెల్‌కు ఉన్న లైన్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌‌ ఫేర్‌‌ సూట్‌, మిటియార్‌‌ బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ మిస్సైల్‌, ఎస్‌సీఏఎల్‌పీ ప్రత్యేకతల వల్ల చైనా ఎయిర్‌‌ఫోర్స్‌ సృష్టించే ఎలాంటి అలజడినైనా మన ఎయిర్‌‌ఫోర్స్‌ ధీటుగా ఎదుర్కోగలదని ఆయన అన్నారు. చైనా ఎయిర్‌‌ఫోర్స్‌లో ఉన్న చైనీస్‌ జే– 20 ఐదో జనరేషన్‌ ఫైటర్‌‌లను కూడా రఫెల్‌, ఎస్‌యూ–30 విమానాలు ధీటుగా ఎదుర్కోగలవని ఆయన చెప్పారు.