దేశం గర్వించదగ్గ ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

దేశం గర్వించదగ్గ ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: భారతదేశం గర్వించదగ్గ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్​పీజేఏ) ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పద్మశ్రీ రఘు రాయ్ సంస్మరణ సభ నిర్వహించారు.  శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ తన ఫొటోలతో భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్ అని కొనియాడారు. 

సంఘం అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ సోమ సుందర్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ మెంబర్స్​కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కె.రాములు, ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ డి.రవీందర్ రెడ్డి, టీఎస్​పీజేఏ ప్రధాన కార్యదర్శి కె.నరహరి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. కిషోర్ సింగ్, పి. రామ్మూర్తి పాల్గొన్నారు.