రాహుల్.. చిదంబరంతో ట్యూషన్ చెప్పించుకోవాలె

రాహుల్.. చిదంబరంతో ట్యూషన్ చెప్పించుకోవాలె
  • కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరంతో ట్యూషన్ చెప్పించుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎగతాళి చేశారు. రైట్​–ఆఫ్, వీవ్–ఆఫ్​ మధ్య తేడా తెలుసుకునేందుకు చిదంబరం వద్ద క్లాస్ చెప్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయనవారంతా బీజేపీ దోస్తులేనని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై జవదేకర్ మండిపడ్దారు. ‘‘రైట్ ఆఫ్ అనేది సాధారణ అకౌంటింగ్ ప్రక్రియ. అది ఢిఫాల్టర్లపై తీసుకోవాల్సిన చర్యలను అడ్డుకోదు. ముందు రైట్​ఆఫ్, వీవ్ ఆఫ్ మధ్య వ్యత్యాసం తెలుసుకునేందు చిదంబరం దగ్గర రాహుల్ ట్యూషన్ తీసుకోవాలి” అని జవదేకర్ అన్నారు. మొహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఉద్దేశపూర్వక ఎగవేత దారుల నుంచి రుణాలు వసూలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు .

దేశంలో 50 మంది ఉద్దేశపూర్వక రుణాల ఎగవేత దారుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో కిందటేడాది సెప్టెంబర్ వరకు సాంకేతింగా ఈ రుణాలు రద్దు(రైట్​–ఆఫ్​) చేసినట్లు వివరించింది. దీని ఆధారంగా రాహుల్ గాంధీ.. భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన వారంతా బీజేపీ సన్నిహితులేనని, వారి వివరాలను తాను పార్లమెంటులో అడిగినప్పుడు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఎగవేతదారులంతా తమకు దగ్గరివారేనన్న విషయం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే బీజేపీ ఆ పేర్లను పార్లమెంటులో వెల్లడించలేదన్నారు.